కరోనా బాధితుల కోసం ఆయుష్ డిపార్ట్మెంట్ అభివృద్ధి చేసిన ఆయుష్ 64(Ayush-64) మందును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రారంభించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని సెంట్రల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. స్వల్ప లక్షణాలు ఉండి కరోనా బారిన పడిన వారికి ఈ ఆయష్ మందును పంపిణీ చేశారు.
గతంలో మలేరియా సోకిన వారికి ఉపయోగించిన ఈ డ్రగ్‌ను ఇప్పుడు కొవిడ్ రోగులకు సైతం అందించాలని సర్కారు నిర్ణయించింది. సేవాభారతి సంస్థతో కలిసి ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నవారికి ఈ మందును అందించనున్నారు. ఆయుర్వేదం మన జీవన విధానంలో భాగమన్నారు కిషన్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆనందయ్య మందు గురించే చెబుతున్నారన్న ఆయన... వేల మంది కరోనా మందు కోసం ఆనందయ్యను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Kishan reddy: వ్యాక్సినేషన్ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు