ETV Bharat / state

CENTRAL MINISTER TOMAR: 'ఆయిల్​పామ్​ మిషన్​ కింద రైతులను ప్రోత్సహిస్తాం'

దేశంలో ఆయిల్‌పామ్ మిషన్ కింద పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో 3వ జాతీయ చిరుధాన్యాల సదస్సను ఆయన ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. నాణ్యమైన ధాన్యమే కొనుగోలు చేస్తామని కేంద్రమంత్రి అన్నారు.

author img

By

Published : Sep 17, 2021, 6:12 PM IST

CENTRAL MINISTER TOMAR: 'ఆయిల్​పామ్​ మిషన్​ కింద రైతులను ప్రోత్సహిస్తాం'
CENTRAL MINISTER TOMAR: 'ఆయిల్​పామ్​ మిషన్​ కింద రైతులను ప్రోత్సహిస్తాం'

నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ప్రజలకు మంచి నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్న దృష్ట్యా... రైతుల నుంచి కూడా ఆ ధాన్యమే సేకరిస్తామని తేల్చిచెప్పారు. రాబోయే యాసంగి నుంచి దొడ్డు వడ్లు కొనుగోలు చేయబోమని భారత ఆహార సంస్థ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకుని హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరగనున్న 3వ జాతీయ చిరుధాన్యాల సదస్సును కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, డీడీజీ సంజయ్‌శర్మ, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ విలాస్.ఎ.తొనాపి, న్యూట్రీ హబ్ సీఈవో బి.దయాకర్‌రావు, శాస్త్రవేత్తలు, అంకుర కేంద్రాల నిర్వాహకులు, పరిశ్రమ వర్గాలు పాల్గొన్నాయి. వర్చువల్ వేదికగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి హాజరయ్యారు.

దేశంలో ఆహార భద్రత సాధించినప్పటికీ... పోషకాహార భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత, అదనపు విలువ జోడింపు, ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, విదేశీ ఎగుమతులు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి తోమర్​ ప్రకటించారు. ఈ విషయంలో చిన్న, సన్నకారు రైతులు, శాస్త్రవేత్తలు, అంకుర కేంద్రాల నిర్వాహకులు, పరిశ్రమ, వ్యాపార వర్గాలు ఒకతాటిపైకి వచ్చి ముందుకు సాగితే రైతుల ఆదాయాలు మరింతగా పెరుగుతాయని స్పష్టం చేశారు. "ఆయిల్‌పామ్‌ మిషన్" కింద రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచడం సహా ఒప్పంద సేద్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ కల్పన ధ్యేయంగా 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి 6850 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సన్నాహాలు సాగుతున్నాయని తోమర్ పేర్కొన్నారు.

దేశంలో ఆయిల్‌పామ్ మిషన్ కింద పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహిస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఒప్పంద సేద్యంపై దృష్టి సారిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. దేశంలో 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. అందుకోసం కేంద్రం 6వేల 850 కోట్లు వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. కరోనాతో అన్ని రంగాలు దెబ్బతిన్నా ఒక్క వ్యవసాయ రంగమే చెక్కుచెదరలేదు. చిరుధాన్యాలు సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంపొందించేందుకు రైతులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి. చిరుధాన్యాలు వినియోగం పెంచే క్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కేంద్రం ప్రోత్సాహం అందిస్తుంది. -నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

'ఆయిల్​పామ్​ మిషన్​ కింద రైతులను ప్రోత్సహిస్తాం'

ఇదీ చదవండి: Amit Shah: విమోచన దినోత్సవం జరిపేందుకు కేసీఆర్‌ భయపడుతున్నారు: అమిత్​ షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.