జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ తీసుకుని పని చేయాలని భాజపా శ్రేణులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య కార్యకర్తలతో జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశానికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, గరికపాటి మోహన్ రావుతో కలిసి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టభద్రులతో ఓటు నమోదు చేయించాలన్నారు.
ఇదీ చదవండి : వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం