ఆర్థికమాంద్యం నుంచి మనదేశాన్ని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందిలేదని...ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. బ్యాంకుల విలీనం ద్వారా బ్యాంకింగ్ సామర్థ్యం పెంచబోతున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనలో మోదీ అనేక అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని వివరించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భాజపా వల్లే ఆర్థికమాంద్యం ఏర్పడిందని తెరాస అసత్య ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లిగడ్డ మినహా మిగతా నిత్యవసర వస్తువుల ధరలు పెరగలేదన్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవంలో బహుమతుల కోసం కోటీ యాభై లక్షలు ఖర్చు చేశారని విమర్శించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అసదుద్దీన్ ఓవైసీ సాధారణ ఎంపీ అని అమెరికా అధ్యక్షుడిని ప్రశ్నించే స్థాయి ఆయనకు లేదన్నారు. దేశంలో ఉన్న రోహ్యింగాల వివరాలు సేకరిస్తున్నామని... తెలంగాణలో 6వేల మంది రోహ్యింగాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఓరుగల్లులో రూ.380కోట్లతో రైల్వే వ్యాగన్