ETV Bharat / state

Kishan Reddy: ఎన్ని కోట్లు ఖర్చైనా ప్రతి ఒక్కరికి టీకా ఇస్తాం.. - Union Minister Kishan Reddy visit ddh

హైదరాబాద్​లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రిని(Durgabai Deshmukh Hospital ) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. కొవిడ్ కట్టడికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేయాలని సూచించారు. మూడో దశ కరోనాపై తప్పుడు ప్రచారలొద్దని హెచ్చరించారు.

Union Minister Kishan Reddy visited Durgabai Deshmukh Hospital in hyderabad
Kishan Reddy: ఎన్ని కోట్లు ఖర్చైనా ప్రతి ఒక్కరికి టీకా
author img

By

Published : Jun 18, 2021, 1:12 PM IST

Updated : Jun 18, 2021, 2:41 PM IST

దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మూడో దశ కరోనాపై(third wave) తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఉద్దేశపూర్వకగా ప్రజల్ని భయపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) హెచ్చరించారు. హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రిని(ddh) ఆయన సందర్శించారు. కొవిడ్​ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు.

ఎన్ని కోట్లు ఖర్చైనా ప్రతి ఒక్కరికి టీకా(vaccine) ఇస్తామని స్పష్టం చేశారు. దేశంలో జనాభా ఎక్కువగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నాయన్న కిషన్‌రెడ్డి... కొవిడ్‌ను కట్టడి చేయాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పని చేయాలని అభిప్రాయపడ్డారు. 15 రోజుల వ్యవధిలో ఆక్సిజన్ కొరతను తీర్చామని... గాంధీ, టిమ్స్‌ సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రాణవాయువు ప్లాంట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 46 ఆస్పత్రులకు 1400 వెంటిలేటర్లు ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. వ్యాక్సిన్​ల ఉత్పత్తి పెంపునకు చేస్తున్న కృషిని వివరించారు. ఇందులో భాగంగా ఇప్పటికే భారత్​ బయోటెక్​కు 1500 కోట్ల రూపాయలను అడ్వాన్స్​ రూపంలో అందించినట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి దేశంలో 200కోట్లకుపైగా వ్యాక్సిన్​లను భారత్ నుంచి ఉత్పత్తి చేయనున్నట్టు పేర్కొన్నారు.

దీ చదవండి : నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం.. మేనమామ, అత్తలే హంతకులా?

Last Updated : Jun 18, 2021, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.