kishan reddy said that KCR : తెలంగాణ సమాజం తనకు జీ హుజూర్ అన్నట్లుగా ఉండాలని... సీఎం కేసీఆర్ భావిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. నియంతల మాదిరిగా తరతరాలు పాలించేందుకు కొత్త రాజ్యాంగం తేవాలని భావిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ భాజపాపై చేస్తున్న విమర్శలకు.... కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ప్రధాని, భాజపాపై అవాస్తవాలతో విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాట తీరు ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చేలా ఉందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ సమైక్యత, సమగ్రతను దెబ్బతీసేలా... సైనికుల మనోస్థైర్యం దెబ్బతినేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని.. పాకిస్తాన్ కూడా ఇలా ఎప్పుడూ విమర్శలు చేయలేదని ఆక్షేపించారు.
కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్
ప్రత్యర్థి పార్టీలను శత్రువులుగా చూడొద్దు. అమర జవాన్ల ఆత్మలు ఘోషించేలా కేసీఆర్ మాట్లాడారు. భారత సైనికుల స్థైర్యం దెబ్బతినేలా కేసీఆర్ మాట్లాడారు. భారత జవాన్ల దాడిలో తమ స్థావరాలు దెబ్బతిన్నాయని పాక్ ఉగ్రవాదులు కూడా వెల్లడించారు. నిజాం తరహా పాలన మళ్లీ రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. తండ్రి తర్వాత కుమారుడు పాలించే రాచరికాన్ని కేసీఆర్ కాంక్షిస్తున్నారు.
-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
చర్చకు సిద్ధం
సీనియర్ పాత్రికేయులు సమక్షంలో గన్‌పార్కు వద్ద మోదీ ప్రభుత్వం ఏడేళ్ల పాలనపై కేసీఆర్‌తో చర్చకు సిద్ధమని కిషన్‌రెడ్డి ప్రకటించారు. సీఎం సవాల్‌ను కేంద్ర ప్రభుత్వం తరఫున స్వీకరిస్తున్నానని తెలిపారు.
ఇదీ చదవండి: కల్వకుంట్ల రాజ్యాంగం అమలైతే రిజర్వేషన్లు రద్దు ఖాయం: బండి సంజయ్