ETV Bharat / state

'విద్యార్థుల తరలింపునకు కేంద్రం ప్రత్యేక చర్యలు... ధైర్యంగా ఉండండి'

kishan reddy about Ukraine Students : ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఉక్రెయిన్ రాయభార కార్యాలయంలో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం వల్ల సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అనుభవం ఉన్న అధికారుల సలహాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

kishan reddy about Ukraine Students , kishan reddy
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
author img

By

Published : Feb 28, 2022, 2:09 PM IST

'విద్యార్థుల తరలింపునకు కేంద్రం ప్రత్యేక చర్యలు... ధైర్యంగా ఉండండి'

kishan reddy about Ukraine Students : ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ రోజుకు నాలుగుసార్లు సమీక్షిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రుల బాధలు అర్థం చేసుకుంటున్నామని... ధైర్యంగా ఉండాలని చెప్పారు.

Ukraine war 2022 : ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయంలో సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండడంతో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో అనుభవం ఉన్న అధికారుల సలహాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి తరలింపు విషయంలో భారతదేశం చేస్తున్న స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్... ఇతర దేశాలు చేయడంలేదని కిషన్ రెడ్డి తెలిపారు.

ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తీసుకురావడానికి కేంద్రం పెద్దఎత్తున కృషి చేస్తోంది. ఆ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలతో మాట్లాడి... ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా వారితో మాట్లాడుతున్నాం. ప్రతీ ఒక్క విద్యార్థిని స్వదేశానికి తీసుకొస్తాం. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దు.

-కిషన్ రెడ్డి , కేంద్ర మంత్రి

ఆపరేషన్‌ గంగ

Operation Ganga : ఆపరేషన్‌ గంగ పేరుతో ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. బుకారెస్ట్‌ నుంచి 249 మంది భారతీయులతో ఐదో విమానం దిల్లీ చేరుకుంది. వీరిలో 16 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారిలో 11 మంది తెలంగాణ, ఐదుగురు ఏపీకి చెందిన వారు ఉన్నారు. దిల్లీకి చేరుకున్న విద్యార్థులు హైదరాబాద్​, తిరుపతికి బయలుదేరారు.

ఇప్పటికే ఇంటికి చేరిన 39 మంది..

telugu students from Ukraine : ఉక్రెయిన్‌ నుంచి దిల్లీకి 25 మంది, ముంబయికి 14 మంది రాగా.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు ముంబయిలో వసతి ఏర్పాట్లు చేశారు. దిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. వారందర్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విమానాల్లో ఉచితంగా శంషాబాద్‌కు తీసుకొచ్చింది. శంషాబాద్‌లో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. తమను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాయబార కార్యాలయ అధికారులకు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఇంకా ఉన్న వారినీ సురక్షితంగా తీసుకొస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ తెలిపారు. అక్కడి నుంచి వచ్చిన విద్యార్థుల వివరాలను ఆయన ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు అందించారు.

చెర్నవిట్స్‌ ప్రాంతంలోని బుకోవినియన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ ఐదో సంవత్సరం చదువుతున్నా. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో భీకర యుద్ధం సాగుతోంది. మేము ఉండే పశ్చిమ ప్రాంతంలో యుద్ధ వాతావరణం లేదు. అక్కడ కూడా ఆరంభమయ్యేలోపు ఎలా బయటపడాలా అని ఆందోళనపడ్డాం. మేము ఉండే ప్రాంతానికి దగ్గరగా ఉండే రుమేనియాకు త్వరగా చేరుకోగలిగాం. అక్కడి నుంచి ముంబయికి.. ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకున్నాం. ఇంకా 2 వేల విద్యార్థులు అక్కడే ఉన్నారు.

- సుప్రియ, శేరిలింగంపల్లి

ఇదీ చదవండి: 'కేవలం వెస్ట్​సైడ్ వారినే తరలించారు.. ఇంకా చాలా మంది ఉన్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.