ETV Bharat / state

ఫ్లైఓవర్​ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి - telangana varthalu

గోల్నాక నుంచి రామంతపూర్​ వరకు ఫ్లైఓవర్​ పనులను కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పరిశీలించారు. వాహనాల రద్దీని తగ్గించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా, జీహెచ్ఎంసీ నిధుల కొరత కారణంగా ఆలస్యం అయిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 500 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

Union Minister Kishan Reddy inspected the flyover works
పాదయాత్రగా ఫ్లైఓవర్​ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి
author img

By

Published : Apr 8, 2021, 12:48 PM IST

పాదయాత్రగా ఫ్లైఓవర్​ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

హైదరాబాద్​లోని గోల్నాక నుంచి రామంతపూర్ వరకు పాదయాత్రగా ఫ్లైఓవర్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర మంత్రి పాదయాత్ర నేపథ్యంలో అంబర్​పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అంబర్​పేట్​లో అనేక సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్య ఉందని... వాహనాల రద్దీని తగ్గించేందుకే రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి వెల్లడించారు. స్మశానవాటికలు ఉన్నందున రోడ్డు విస్తరణ పనులు అనుకున్న స్థాయిలో జరగలేదని... కావున ఫ్లై ఓవర్ ఒక్కటే పరిష్కారమని ఈ పనులను చేపట్టామన్నారు.

నిధుల కొరత కారణంగానే ఆలస్యం

మోదీ ప్రభుత్వం వచ్చాక నితిన్ గడ్కరీ సహకారంతో ఫ్లై ఓవర్ పనులు ముందుకు వెళ్లాయి. 2018లో శంకుస్థాపన చేయించాం. రాష్ట్ర ప్రభుత్వం వాటా, జీహెచ్ఎంసీ నిధుల కొరత కారణంగా ఆలస్యం అయింది. భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. పైపులైన్, 11 కేవీ కేబుల్ షిప్టింగ్ ఛార్జీలను కేంద్రమే భరిస్తుంది. కొన్ని శాఖలనుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రజల సహకారం కావాలి. శాశ్వత పరిష్కారం కోసమే పనిచేస్తున్నాం. ప్రార్థన మందిరాలు, స్మశానవాటికల నిర్వాహకులు పెద్దమనసుతో ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. ట్రాఫిక్​ను డైవర్ట్ చేయాల్సి వుంది. ప్రజలకు కొంత ఇబ్బందులు తప్పవు, అందరూ అర్థం చేసుకోవాలి. ఆలస్యం చేయకుండా అధికారులు వారానికి ఒకసారి సమన్వయ సమావేశాలు నిర్వహించుకొని పనులను పర్యవేక్షించుకోవాలి. ఒకట్రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో హై లెవల్ మీటింగ్ ఏర్పాటుచేసి పనులను వేగవంతం చేస్తాం. -కిషన్​రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

భూసేకరణ పనుల ఆలస్యం వల్లే పనులు వేగంగా జరగలేదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా భూసేకరణ చేసి కాంట్రాక్టర్​కు అందిస్తే పనులు వేగం పుంజుకుంటాయన్నారు. 500 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. సిగల్ కేఫ్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ వరకు 100 ఫీట్ల రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. ప్రార్థన మందిరాల తొలగింపుపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలును మంజూరు చేయించామని కేంద్రమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి నిధులు కేటాయించాలని అన్నారు. 17వేల కోట్లతో 13 నుంచి 14 జిల్లాలను కలుపుకొని రీజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేశామని.... సర్వే కూడా పూర్తి అయిందన్నారు. భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారని... భూసేకరణకు కేంద్రం తనవంతు సహాయం అందిస్తుందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు వస్తే తెలంగాణ ముఖచిత్రం మారుతుందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రేపట్నుంచి సాయంత్రం 5గంటల తర్వాత బేగం బజార్ బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.