హైదరాబాద్ మల్లేపల్లిలోని బీజేవైఎం నేతలు నిర్వహించిన సేవాహీ సంఘటన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సుమారు 250 మంది నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నాలుగు ఆదివారాల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు రాము యాదవ్ తెలిపారు.
రెండో దశ లాక్డౌన్లో.. నిరుపేదలకు భరోసా కల్పిస్తూ రూ.80 కోట్ల వ్యయంతో 26 కోట్ల మంది ప్రజలకు అండగా నిలుస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రేషన్‌కు అదనంగా 10 కిలోల బియ్యంతో పాటు పప్పు కూడా అందించే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కర్ణాకర్, భాజపా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Putta madhu: కవిత, సంతోష్‌పై ఈటల వ్యాఖ్యలను ఖండించిన పుట్ట మధు