ETV Bharat / state

విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్: కిషన్‌రెడ్డి - secunderabad railway station modernization

విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. రూ.719.30 కోట్లతో స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని.. దక్షిణభారత్​లోనే ఉత్తమ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. స్టేషన్‌ ఆధునికీకరణపై నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు.

దక్షిణ భారత్‌లో ఉత్తమ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్​ను తీర్చిదిద్దుతాం: కిషన్‌రెడ్డి

author img

By

Published : Nov 14, 2022, 7:01 PM IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం ఎ.కె.జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.719.30 కోట్లతో స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫారాలను పూర్తిగా ఆధునీకరిస్తామని.. పార్కింగ్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. 26 ఆధునిక లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన.. విమానాశ్రయం తరహాలో రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతామన్నారు. దక్షిణభారత్​లోనే ఉత్తమ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

మూడు దశల్లో 36 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. కాజీపేటలో రూ.384 కోట్లతో వ్యాగన్ వర్క్‌షాప్ కోసం టెండర్లు పిలిచామని.. 150 ఎకరాల భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులకు రాష్ట్రం నిధులు ఇవ్వాలని కిషన్‌రెడ్డి కోరారు. రాష్ట్రం నిధులు విడుదల చేస్తే.. పనులు త్వరగా పూర్తవుతాయన్నారు. విజయవాడ-సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైళ్లు రాబోతున్నాయన్న ఆయన.. తిరుపతి వరకు వందే భారత్‌ రైళ్లు పొడిగించాలని కోరామని తెలిపారు. 1,300 కి.మీ మేర కొత్త లైన్ల కోసం భూసేకరణ జరుగుతోందని స్పష్టం చేశారు.

రూ.719.30 కోట్లతో సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. స్టేషన్‌ ప్లాట్‌ఫారాలను పూర్తిగా ఆధునీకరిస్తాం. విమానాశ్రయం తరహాలో రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతాం. మూడు దశల్లో 36 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించాం. ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులకు రాష్ట్రం నిధులు ఇవ్వాలి. విజయవాడ-సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైళ్లు రాబోతున్నాయి. తిరుపతి వరకు వందే భారత్‌ రైళ్లు పొడిగించాలని కోరాం. - కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

ఇవీ చూడండి..:

Metro Charges: కొత్త సంవత్సరం నుంచే మెట్రో ఛార్జీల పెంపు?

Children's Day Special Story: 'చిన్నారుల ప్రపంచం' రక్షించే బాధ్యత తల్లిదండ్రులదే..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.