Kishan Reddy cleaned the toilets: పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్లలో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ వారి సహకారంతో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఓయూ గవర్నమెంటు స్కూల్లో హై ప్రెషర్ టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్‌ను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లు, మూత్రశాలలను పరిశీలించిన కిషన్‌రెడ్డి.. శౌచాలయాన్ని శుభ్రం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
అనంతరం మాట్లాడిన ఆయన.. టాయిలెట్స్ శుభ్రంగా లేనట్లయితే దాని ప్రభావం పిల్లల ఆరోగ్యంపై వారి చదువుపై కూడా పడుతుందని పేర్కొన్నారు. కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గుర్తు చేశారు. వసతి గృహాల్లో మరుగుదొడ్ల శుభ్రత కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
"ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్వహణ పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లలకు వాటి నిర్వహణ తెలియదు దానికి పూర్తి బాధ్యత అక్కడ ఉన్న ఉపాధ్యాయులు తీసుకోవాలి. టాయిలెట్స్ శుభ్రంగా లేకుంటే వాటి ప్రభావం పిల్లల ఆరోగ్యం పడుతుంది. వసతి గృహాల్లో మరుగుదొడ్ల శుభ్రత కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది".- కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
ఇవీ చదవండి: