ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మెట్రోకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం తెలిపింది. మెట్రో ఏర్పాటుకు నిధుల సేకరణ, మొబిలిటీ ప్రణాళికను రాష్ట్రాలే తయారుచేయాలని పేర్కొంది. టీడీపీ ఎంపీ కనకమేడల విజయవాడ మెట్రోపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ జవాబిచ్చారు. ప్రత్యామ్నాయ నివేదిక, డీపీఆర్‌ను రాష్ట్రాలే తయారుచేయాలని వివరించింది. కొత్త మెట్రో విధానం మేరకు ప్రతిపాదనలు కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పంపలేదని వెల్లడించింది.
ఇవీ చదవండి: తెలంగాణ ఆడబిడ్డలు భయపడేదేలే.. వెనక్కి తగ్గేదేలే.. : కవిత
సర్పంచ్‌కు దొరికిన భారీ డైమండ్.. రాత్రికి రాత్రే లక్షాధికారిగా..!