ETV Bharat / state

సీఎం కేసీఆర్​తో కేంద్రమంత్రి సింధియా భేటీ.. ఏఏ అంశాలు చర్చించారో తెలుసా? - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

Union Minister Jyotiraditya Cynthia meets CM KCR

author img

By

Published : Sep 11, 2021, 5:48 PM IST

Updated : Sep 11, 2021, 7:17 PM IST

17:46 September 11

సీఎం కేసీఆర్​తో సింథియా భేటీ.. కీలక అంశాలపై చర్చ

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం కేసీఆర్ జ్ఞాపికను బహూకరణ

రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సింథియా.. ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కేంద్రమంత్రిని మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించిన సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయనతో ప్రస్తావించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఎకానమిక్ గ్రోత్ సెంటర్​గా అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటోందని కేసీఆర్​ సింథియాకు వివరించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలని కేంద్రమంత్రిని కోరారు. బిజినెస్, ఐటీ, హెల్త్, టూరిజం హబ్​గా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఇంకా విస్తరిస్తున్నాయని.. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, పలు అంతర్జాతీయ నగరాల నుంచి ప్రయాణికులు వస్తున్నారని తెలిపారు. సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, యూఎస్​లకు హైదరాబాద్ నుంచి నేరుగా విమానాల కనెక్టివిటీని పెంచేలా తగు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలో ఉన్న 6 విమానాశ్రయాల అభివృద్ధి, ఆపరేషన్స్ కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని.. కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ నుంచి తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు.

సంపూర్ణ సహకారం అందిస్తాం..

శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రమంత్రి సింథియా హామీ ఇచ్చారు. భవిష్యత్తులో శంషాబాద్ విమానాశ్రయం ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వరంగల్-మామునూరు విమానాశ్రయంలో ఏటీఆర్ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న 6 విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్​పల్లిలో విమానాశ్రయానికి సంబంధించిన సాంకేతిక అనుమతులు త్వరలోనే ఇస్తామన్న ఆయన... ఆదిలాబాద్​లో వాయుసేన ద్వారా విమానాశ్రయం ఏర్పాటు చేసే అంశాన్ని తమ మంత్రిత్వశాఖ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్, కొత్తగూడెం, మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో చిన్న విమానాలు వచ్చిపోయేలా విమానాశ్రాయల అంశాన్ని పున: పరిశీలన చేసి తగు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: Jyotiraditya Scindia: వరంగల్‌, ఆదిలాబాద్‌లో బ్రౌన్ ఫీల్డ్‌ విమానాశ్రయాలు!

Last Updated : Sep 11, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.