ETV Bharat / state

'వాతావరణ పరిస్థితులు సవాలుగా మారాయి'

నీటి వృథా, వ్యర్థాల నిర్వహణపై రెండు రోజులపాటు హైదరాబాద్​లో జరిగిన అంతర్జాతీయ సదస్సు-2020 ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి సోం ప్రకాశ్‌ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్‌లో నీటీ వృథా, వ్యర్థాల నిర్వహణ సవాల్‌గా మారిందని తెలిపారు.

minister
minister
author img

By

Published : Feb 19, 2020, 11:12 AM IST

నీటి వినియోగం- వ్యర్థాల నిర్వహణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాశ్‌ అన్నారు. హైదరాబాద్ బేగంపేట మనోహర్ హోటల్‌లో వేస్ట్ మేనేజ్​మెంట్‌ - వాటర్ వెస్ట్ మెనేజ్​మెంట్ ఆధ్వర్యంలో నీటి వృథా, వ్యర్థాల నిర్వహణపై రెండు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు-2020 ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, ప్రత్యేకించి వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లో నీటి వృథా, వ్యర్థాల నిర్వహణ సవాల్‌గా మారిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం పొంచి ఉన్నందున పర్యావరణం, జీవవైవిధ్యం, భూగోళం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి..

అందుబాటులోకి వచ్చిన అనేక సాంకేతిక పరిజ్ఞానాలు అందిపుచ్చుకోవాలన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి చెందిన దేశాలు అనుభవాలు మనం అన్వయించుకున్నట్లైతే పర్యావరణం బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. శరవేగంగా నగరీకరణ విస్తరిస్తున్న తరుణంలో పౌరుల ఆరోగ్యం దృష్ట్యా పురపాలక శాఖ, నగరపాలక సంస్థలు నీటి వృథా, వ్యర్థాల నిర్వహణ పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.