Tribal Reservations in Telangana: గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
‘‘తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంపునకు సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది. ఆ రిజర్వేషన్లను 10 శాతం వరకు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోం శాఖకు చేరింది. రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానంలో కేసుల పరిష్కారం తర్వాతే దీనిపై ముందకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’- అర్జున్ ముండా, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
ఇవీ చదవండి:
- నేడు దిల్లీకి కేసీఆర్.. ఎల్లుండి బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం
- ఎమ్మెల్యేలకు ఎర కేసు.. తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న నందు అక్రమాల బాగోతాలు
- మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో కేంద్ర జీఎస్టీ సోదాలు