దేశానికి మరింత పేరు తెచ్చేలా ఐఐటీ హైదరాబాద్ ఆచార్యులు, విద్యార్థులు తమ పరిశోధనలు కొనసాగించాలని... కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ అంకుర సంస్థ తయారు చేసిన హైజిన్ ఉత్పత్తులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఆవిష్కరించారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా దీర్ఘకాలం ప్రభావం చూపే పరిశుభ్రత ఉత్పత్తులు తయారు చేసిన పరిశోధకులను కేంద్ర మంత్రి అభినందించారు. నెలకొల్పిన అతి తక్కువ కాలంలోనే ఐఐటీ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతోందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తల్లిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు