ETV Bharat / state

Union Bank of India:యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా నూతన భవనం ప్రారంభం - తెలంగాణ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్​ భట్టాచార్య

వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో ఎల్లప్పుడు ముందుంటామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్​ భట్టాచార్య​ అన్నారు. హైదరాబాద్​లోని హిమాయత్​నగర్​లో నిర్మించిన నూతన భవనాన్ని డీజీఎం ప్రమోద్​ కుమార్​తో కలిసి ఆయన ప్రారంభించారు. రెండు బ్యాంకుల విలీనంతో దేశంలోనే ఐదో పెద్ద అతిపెద్ద బ్యాంకుగా అవతరించిందని తెలిపారు.

Union Bank of India
హిమాయత్​నగర్​లో యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా నూతన భవనం ప్రారంభం
author img

By

Published : Jul 26, 2021, 5:21 PM IST

దేశంలోనే ఐదో అతిపెద్ద బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవతరించిందని తెలంగాణ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్​ భట్టాచార్య తెలిపారు. బ్యాంకుల విలీనంతో దాదాపు 15 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్​లోని హిమాయత్​నగర్​లో నిర్మించిన బ్యాంక్​ నూతన భవనాన్ని డీజీఎం ప్రమోద్​ కుమార్​తో కలిసి ప్రారంభించారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

దేశంలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదో స్థానంలో కొనసాగుతోందన్నారు. ప్రాధాన్యత రంగాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడమే కాకుండా... వాహన, ఇళ్లు, వ్యక్తిగత, వ్యాపారులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. గత 56 ఏళ్లుగా హైదర్​గూడలో కొనసాగుతున్న బ్రాంచ్​ను వినియోగదారుల సౌకర్యార్థం హిమాయత్ నగర్​కు మార్చినట్లు కబీర్​ భట్టాచార్య తెలిపారు. ఆరు కోట్ల 25 లక్షల లావాదేవీలతో ఈ శాఖ అగ్రగామిగా నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఖాతాదారులు, బ్యాంక్ అధికారులను ఘనంగా సన్మానించారు.

Unionయూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా నూతన భవనం ప్రారంభం Bank of India

ఆంధ్ర, కార్పొరేషన్​ బ్యాంకుల విలీనం తర్వాత యూనియన్​ బ్యాంక్ ఐదో అతిపెద్ద బ్యాంక్ అయింది. 15 లక్షల కోట్ల బిజినెస్​, 9,500కి పైగా శాఖలు, 2 వేల ఏటీఎంల ద్వారా సేవలందిస్తున్నాం. తెలంగాణలో స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా తర్వాతి స్థానం మనదే. సేవలు, బ్రాంచ్​ల విస్తరణలో తెలంగాణలో మొదటిస్థానంలో ఉన్నాం. మూడు బ్యాంకులకు దాదాపు 300 ఏళ్ల అనుభవం ఉంది. ఖాతాదారులకు సేవలందించడంలో ఎల్లప్పుడు ముందుంటాం. ఉద్యోగులు ఎప్పుడు మారిపోతూనే ఉంటారు.. కానీ వినియోగదారులే మాకు శాశ్వతం. మీరే మాకు ఆధారం కూడా. మీ నుంచి సూచనలు, సలహాలు ఎల్లప్పుడు తీసుకుంటూనే ఉంటాం. మరింత మెరుగైన సేవలందించేందుకు మీ విలువైన సలహాలను స్వీకరిస్తాం. కరోనా సమయంలో అందరూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాం. కానీ అన్నింటినీ అధిగమించి సేవలను పునరుద్ధరించాం. హిమాయత్​నగర్​లో ప్రారంభించిన ఈ శాఖ ద్వారా ప్రజలకు సేవందించేందుకు మరింత దగ్గరవుతున్నాం.

- కబీర్​ భట్టాచార్య, ఎఫ్​జీఎం, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.