kaloji university : యూజీ ఆయూష్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూజీ నీట్’ ఆయూష్ కటాఫ్ స్కోర్‌ను 5% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆ మేరకు క్వాలిఫయింగ్ కటాఫ్ జనరల్ కేటగిరీకి 45 పర్సెంటైల్, దివ్యాంగులు (జనరల్)కు 40, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వ్డ్ కేటగిరీలకు 35 పర్సెంటైల్‌గా నిర్ణయించారు. కటాఫ్ మార్కులు తగ్గడంతో ఇందుకనుగుణంగా అర్హులైన అభ్యర్థులు బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్ కన్వీనర్ కోటా అలాగే బీహెచ్‌ఎంఎస్ యాజమాన్య కోటాల్లో దరఖాస్తు చేసుకోడానికి వెసులుబాటు కల్పిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మరోసారి ప్రవేశ ప్రకటనలను జారీచేసింది.
అయితే ఆసక్తి ఉన్న అభ్యర్థులు కన్వీనర్, యాజమాన్య కోటాలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 2న ఉదయం 8 గంటల నుంచి 3 మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విదుదల చేస్తారు. మరిన్ని వివరాలకు వర్శిటీ వెబ్‌సైట్‌ను చూడాలని అధికారులు సూచించారు.
ఇదీచూడండి: 'ఒకేసారి వివిధ రకాల డ్రగ్స్ తీసుకోవడం వల్లే బీటెక్ విద్యార్థి మృతి'