కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాల రద్దుకు భవిష్యత్తులో డిమాండ్లు పెరుగుతాయని పేర్కొన్నారు.
బేగంపేట ప్లాజా హోటల్లో.. రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం.. పార్టీ కార్యకర్తలతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అథవాలే సమావేశం అయ్యారు. రైతులు, వ్యవసాయంపై ప్రభుత్వం సానుకూల ధృక్పథంతో ఉందని తెలిపారు.
అపోహ..
వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేకూర్చవని స్పష్టం చేశారు. వాటి సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భూములను కాంట్రాక్టర్లు లాక్కుంటారనే అపోహ అన్నదాతల్లో ఉందని.. అలాంటి ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు. నిరసనలు ఆపేసి చర్చలు జరపాలని కోరారు.
తెలంగాణలో భూమి లేని పేదలకు సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఐదెకరాలు ప్రభుత్వం ఇవ్వాలి. రిపబ్లిక్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం వద్ద భూమి లేకుంటే కొనుగోలు చేసి ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. విద్య, ఉద్యోగాల్లో రెడ్డి సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వాలి.
-రాందాస్ అథవాలే, కేంద్ర సహాయ మంత్రి
ఇదీ చూడండి: ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో రుణమాఫీ : హరీశ్‌రావు