రైతులకు పెట్టుబడి రాయితీని కేంద్రం మొదటిసారిగా అమలు చేస్తోందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా లోక్సభలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రూ.6 వేలు చొప్పున కేంద్రం అందజేస్తోందని స్పష్టం చేశారు. కేంద్రం అందించే ప్రోత్సాహకం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలని లోక్సభలో మంత్రి అన్నారు.
ఇదీ చదవండీ...'దాగుడు మూతలు ఉండవు.. దాటాలనుకుంటే దాటేస్తాం'