దేశంలో రిజర్వేషన్ విధానం కొనసాగలంటే అంబేడ్కర్ భావజాలం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అసవరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గిరిజన శక్తి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు- ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..రిజర్వేషన్‌ల పరిరక్షణ- ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్‌ల సాధనకై గిరిజన రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం విధానాలతో మరల దేశంలో అంట రానితనం, కుల వ్యవస్థలు పెరిగిపోతాయని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విధానలే మాకు అదర్శం అంటూ... వారి సిద్ధాంతలకు పాతరవేస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం దేశంలో రెండే సమాజాలు ఉన్నాయని ఒకటి దోపిడి, రెండు దోపిడీకి గురయ్యే సమాజాలు అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మాదిరిగా మారిపోయాని అవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్‌తో పాటు.. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, వివిధ సంఘాలకు చెందిన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఈటీవీ భారత్ కథనంపై స్పందించిన సీఎం కేసీఆర్