ETV Bharat / state

Woman Suicide In Amberpet : 'నువ్వు లేక నేను లేను' అంటూ భర్త చెంతకు.. - అమెరికాలో మృతిచెందిన సాహితి భర్త మనోజ్‌

Woman Committed Suicide At Amberpet In Hyderabad : జీవితాంతం తోడు నీడగా ఉంటామని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని ఆ ఇల్లాలు పాటిస్తూ.. భర్త వెంటే పయనించింది. వెంటే ఉంటానన్న బంధం మధ్యలోనే వదిలేసి పోవడంతో ఆమె తల్లడిల్లిపోయింది. తన తోడు వెళ్లిపోయిందన్న దిగులు ఆమె తనువుచాలించేలా చేసింది. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్​లోని అంబర్​పేటలో జరిగిన ఈ ఘటన విషాదాన్ని మిగిల్చింది. భర్త చితి ఆరకముందే భార్య ఆత్మహత్య స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. ఆమె వెళ్లిపోతూ కూడా నేత్ర దానం చేసి మరొకరికి చూపునిచ్చింది.

Woman Suicide In Amberpet
Woman Suicide In Amberpet
author img

By

Published : May 25, 2023, 7:34 PM IST

'నువ్వు లేక నేను లేను' అంటూ భర్త చెంతకు..

Woman Committed Suicide At Amberpet In Hyderabad : కట్టుకున్న భర్త అకాల మరణం ఆ మహిళకు తీవ్ర మనోవేదన గురిచేసింది. తన భర్తలేని ఈ లోకంలో తాను కూడా ఎందుకని తనువు చాలించింది. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటుచేసుకుంది. రోజుల వ్యవధిలోనే రెండు మరణాలు చూసిన వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన కోరె మనోజ్‌ కుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. అలాగే కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ పూర్తి చేశారు.

అనంతరం డల్లాస్​లోని యూఎస్‌ఏఏ కంపెనీలో ఆటోమేషన్ సాఫ్ట్​వేర్ డెవలపర్​గా పనిచేస్తున్నారు. మంచి ఉద్యోగం రావడంతో పాటు జీవితంలో మంచి భాగస్వామి కోసం అతను ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే అంబర్​పేట డీడీ కాలనీకి చెందిన బత్తుల సురేశ్, ఉమ పెద్ద కుమార్తె అయిన సాహితితో వివాహం ఘనంగా జరిపించారు. సాహితి కూడా ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఆస్ట్రేలియాలో ఎంఎస్‌ పూర్తి చేసింది. 2021 అక్టోబర్​లో వీరి వివాహం జరిగింది.

Woman Committed Suicide In Hyderabad : అప్పటి నుంచి మనోజ్‌, సాహితి డల్లాస్​లో నివాసం ఉంటున్నారు. ఏడాదిన్నర పాటు వారి జీవితం హాయిగా సాగిపోయింది. ఒకరినొకరు చాలా అర్థం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ఈ సంతోషానికి తోడు ఇటీవలే సాహితికి కూడా డల్లాస్​లోని ఓ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. తన పాస్​పోర్ట్ రెన్యువల్​తో పాటు కుటుంబ సభ్యులను చూసి వెళదామని ఈ నెల 2వ తేదీన సాహితి హైదరాబాద్ వచ్చింది. వనస్థలిపురంలోని అత్తవారి ఇంట్లో, డీడీ కాలనీలోని తల్లి ఇంట్లో సంతోషంగా గడుపుతోంది.

గుండెపోటుతో అమెరికాలో మృతిచెందిన సాహితి భర్త మనోజ్‌: ఎమైందో ఏమో తెలియదుకానీ.. ఈ నెల 20న డల్లాస్​లో ఉన్న తన భర్త మనోజ్​కు గుండెపోటు వచ్చిందని ఆసుపత్రిలో చేర్పించామని మనోజ్ స్నేహితులు సాహితికి చెప్పారు. చెప్పిన కొద్దిసేపటికే ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆమెకు సమాచారం అందింది. దీంతో సాహితి దిగ్బ్రాంతికి గురైంది. జీవితాంతం తోడుంటాడని భావించిన భర్త ఇక లేడు అన్న వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. స్నేహితుల సాయంతో కుటుంబసభ్యులు మనోజ్ మృతదేహాన్ని ఈ నెల 23న హైదరాబాద్​కు తెప్పించారు.

సంతోషంగా జీవస్తున్నారనుకునే లోపే కుమారుడు హఠాన్మరణంతో మనోజ్‌ మృతదేహంపై పడి తల్లిదండ్రులు గుండెలవిశేలా రోదించారు. తన కుమర్తెను కంటికి రెప్పలా చూసుకున్న మనోజ్‌ ఇలా మృతి చెందడంతో సాహితి తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. అశ్రునయనాల మధ్య బుధవారం వనస్థలిపురంలో మనోజ్ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల అనంతరం బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సాహితి తన తల్లితండ్రులతో డీడీ కాలనీలోని పుట్టింటికి వచ్చింది. రాత్రి సాహితి, ఆమె చెల్లెలు సంజన కలిసి ఒకే గదిలో నిద్రించారు.

భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య: గురువారం ఉదయం 9:20 గంటల సమయంలో సాహితి సోదరి బయటకు వెళ్లి వచ్చే లోపు సాహితి తన గదికి తాళం పెట్టుకుంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో అనుమానంతో తలుపు బద్దలు కొట్టి చూడగా సాహితి ఫ్యాన్‌కి ఉరివేసుకుంది. అయితే అప్పటికే సాహితి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మనోజ్‌ చనిపోయిన చోటనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. తన భర్తపై ఉన్న ప్రేమతో తాను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిన సాహితి.. వెళుతూ వెళుతూ.. తన నేత్రాలను దానం చేసి మరికొందరికి చూపునిచ్చింది. ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకుని వెళ్లారు. ఈ విషాద ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.