పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు... వివిధ రాష్ట్రాలకు చెందిన 80 మంది ఇస్లామిక్ మతస్థులు నేడు ఉమ్రాయాత్రకు పయనమయ్యారు. ఉమ్రాలోని మదీనాను దర్శించుకుని తిరిగి ఏప్రిల్ 6న స్వస్థలాలకు చేరుకుంటారు. యాత్రలో భాగంగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన వారికి... అమెరికన్ సిటిజన్ ముఫ్తి హైమద్ రియాజ్ అలీ వీడ్కోలు పలికారు.మరో బృందం ఏప్రిల్ 27న....
ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని హలీమ్ నిజాం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అల్ హజ్ మహమ్మద్ ఫయాజ్ అలీ తెలిపారు. ఉమ్రా యాత్రలు చేయాలనుకున్నవారు తమను సంప్రదించాలని కోరారు. మరో బృందం ఏప్రిల్ 27న వెళ్తుందని తెలియజేశారు.
ఇవీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ తనిఖీలు