ETV Bharat / state

సామూహిక పంచాంగ శ్రవణం వద్దు.. నిరాడంబరంగానే ఉగాది వేడుకలు - మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి తాజా వార్తలు

Ugadi celebrations
ఉగాది వేడుకలు
author img

By

Published : Apr 8, 2021, 3:13 PM IST

Updated : Apr 8, 2021, 3:50 PM IST

15:10 April 08

ఈ ఏడాది కూడా నిరాడంబరంగా ఉగాది వేడుకలు

కరోనా వ్యాప్తి దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఏడాది ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల13న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థాన పంచాంగాన్ని ఆవిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు.  

ఉగాది నాడు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. భ‌ద్రాద్రి ఆలయ అధికారులు, వేద‌పండితులు మంత్రిని క‌లిశారు. ఈ నెల 21న జరిగే సీతారాముల‌ కల్యాణ మహోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రిక అందించారు.

ఇదీ చదవండి: బోనాల్లో పాల్గొన్న 40 మందికి కరోనా

Last Updated : Apr 8, 2021, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.