Udayagiri ysrcp MLA: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఛాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చంద్రశేఖర్‌రెడ్డి గుండె రక్తనాళాల్లో రెండుచోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నెల్లూరులోనే ఉన్న ఆయనను మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆస్పత్రికి తరలించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తన ఆరోగ్యం బాగుందని, రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తానని మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.
ఇవీ చదవండి