ETV Bharat / state

UAE Consulate In Hyderabad : జూన్ 14న హైదరాబాద్​ UAE కాన్సులేట్ భవనం ప్రారంభోత్సవం

author img

By

Published : May 25, 2023, 2:20 PM IST

UAE Consulate In Hyderabad : హైదరాబాద్​లో యూఏఈ కాన్సులేట్ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు సేవలు అందించే ఈ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం జూన్ 14వ తేదీన జరగనుంది. ఈ మేరకు యూఏఈ కాన్సులేట్‌ జనరల్‌ ఆరేఫ్ అలీ అల్తాబూర్ అల్నుయిమి ఈ విషయాన్ని తెలిపారు.

Uae Consulate In Hyderabad
హైదరాబాద్​లో UAE కాన్సులేట్ భవనం

UAE Consulate Inauguration In Hyderabad : హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది. ఇక్కడ ఉండే అరబ్‌ దేశాల పౌరులకు వివిధ సేవలు అందించడంతో పాటు.. ఆ దేశానికి వెళ్లే వాళ్లకు వీసాలు జారీ చేస్తుంది. ఇందుకోసం సిద్ధమవుతున్న హైదరాబాద్‌ యూఏఈ కాన్సులేట్‌ భవనం జూన్‌ 14వ తేదీన ప్రారంభం కానున్నట్లు యూఏఈ కాన్సులేట్‌ జనరల్‌ ఆరేఫ్ అలీ అల్తాబూర్ అల్నుయిమి తెలిపారు.

వీసాలను జారీ చేసేందుకు : భారత్‌తో యుఏఈ సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఇది దోహదం చేస్తోంది. వివిధ అవసరాల నిమిత్తం రోజు రోజుకు భారత్‌ నుంచి అరబ్‌ దేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరో వైపు యూఏఈ-భారత్‌ల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఈ కాన్సులేట్‌ కార్యాలయం అటు యూఏఈ పౌరులకు, ఇటు భారతీయులకు అనేక సేవలను అందించనుంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని యూఏఈ పౌరుల భద్రతను నిర్ధారించేందుకు అవసరమైన డాక్యుమెంటరీ సహాయం అందించేందుకు, ఇతర సేవలను కూడా ఇది అందిస్తుంది. అదేవిధంగా భారతీయ పౌరులకు వీసాలు కూడా మంజూరు చేస్తుంది.

ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలకు : ద్వైపాక్షిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలతోపాటు యూఏఈ ప్రయోజనాలను ప్రభావితం చేసే సమస్యలపై భారత అభిప్రాయాలను యూఏఈ ప్రభుత్వానికి నివేదిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు యూఏఈ ఎగుమతుల విస్తరణను ఇది ప్రోత్సహిస్తుంది. బహిరంగ మార్కెట్లను సమర్థిస్తుంది. వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసి, వ్యాపారాలకు సహాయం చేస్తుంది. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, విద్యా మార్పిడిని మరింత సులభతరం చేస్తుంది.

200 మందికి ఒకేసారి ఇంటర్వ్యూ జరిగేలా : 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కాన్సులేట్‌ భవనంలో అత్యాధునిక సదుపాయాలతో దాదాపు 200 మంది ప్రజలకు ఒకేసారి మాక్‌ వీసా ఇంటర్వ్యూలు నిర్వహించే విధంగా రూపొందించారు. రోజు, రోజుకు యూఏఈ కాన్సులేట్‌ అవసరాలు పెరుగుతుండడం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కాన్సులేట్‌ భవనాన్ని నిర్మించినట్లు యూఏఈ కాన్సులేట్‌ జనరల్‌ ఆరేఫ్ అలీ అల్తాబూర్ అల్నుయిమి తెలిపారు. ప్రస్తుతానికి 16 మంది ఉద్యోగులతో ప్రారంభించనున్న కాన్సులేట్‌ అతి త్వరలో కార్యకలాపాలను విస్తరించేందుకు చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

జూన్‌ 14న అందుబాటులోకి : భారీ వ్యయంతో కట్టిన ఈ ఆధునిక భవనం...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్ర ప్రజల వీసా సౌకర్యాల కోసమే కాకుండా హైదరాబాద్​లో అమెరికా వాణిజ్య అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విశాలమైన భవనం కట్టారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో జరగనున్న జీ20 సదస్సుపై దృష్టి సారిస్తూ వాణిజ్య పరంగా భారత్‌తో చేతులు కలిపేందుకు ఎదురుచూస్తున్నామని యుఏఈ కాన్సులేట్‌ జనరల్‌ ఆరేఫ్ అలీ అల్తాబూర్ అల్నుయిమి తెలిపారు. జూన్‌ 14వ తేదీన ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ యూఏఈ కాన్సులేట్‌ భవనం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పెంచేందుకు ఎదురుచూస్తోందని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.