ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. తిరుపతి నగరంలోని కొర్లగుంట కూడలిలో ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. దుర్భాషలాడుతూ కర్రలతో రక్తం వచ్చేలా కొట్టారు. ఆ దాడి సమయంలో పక్కనే ఉన్న దుకాణదారుడు యువకులను వారించే ప్రయత్నం చేశాడు.
రక్తం కారుతోంది.. దాడి చేయోద్దంటూ వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్మించాడు. అయినప్పటికీ వినకుండా అలా చెప్పిన వ్యక్తిపై కూడా దౌర్జన్యానికి దిగారు. ఈ తతంగాన్నంతా ఎవరో వీడియో తీసి సామాజిక మాద్యమాల్లో పెట్టటంతో ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఇవీ చూడండి: పీసీసీ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ.. ఆ 'హస్త'వాసి ఎవరిదో!