హైదరాబాద్ పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం వికటించి రెండో తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించగా... డెంగీగా నిర్ధారించారు. ఆదివారం రోజు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి వరకు బాగానే ఉన్న తమ కుమారుడు నర్సు ఇచ్చిన ఓవర్ డోస్ ఇంజెక్షన్ వల్లే కోమాలోకి వెళ్లి చనిపోయాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల కిందట మరణించినా... ఆ విషయం తమకు చెప్పకుండా నాటకం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు మృతి చెందాడంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఇదీ చూడండి : 'డెంగీ'పై హైకోర్టు సీరియస్