తెలుగు రాష్ట్రాల్లో సోదాలపై ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 6న జరిపిన సోదాల్లో ఏపీ, తెలంగాణలో సుమారు రూ.2 వేల కోట్ల అవకతవకలను గుర్తించినట్లు పేర్కొంది. విజయవాడ, కడప, విశాఖ, దిల్లీ, పుణె సహా 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని తెలిపింది.
తెలంగాణ, ఏపీలోని 3 ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు చేశామని.. మూడు ఇన్‌ఫ్రా కంపెనీల్లో నకలీ బిల్లులు గుర్తించామని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో చేసిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయని తెలిపింది. లెక్కలు చూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల విలువైన ఆభరణాలు లభ్యమయ్యాయని వివరించింది. ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ తనిఖీ చేశామని పేర్కొంది. పలువురికి చెందిన 25కు పైగా బ్యాంకు లాకర్లను సోదాల్లో గుర్తించామని తెలిపింది.
ఇవీ చూడండి: ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు