ETV Bharat / state

కత్తులతో దాడి చేసి చంపేశారు - హైదరాబాద్​ నేర వార్తలు

ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని... కారుతో ఢీకొట్టి.. కింద పడిన వారిపై కత్తులతో దాడి చేసి అంతమొందించిన ఘటన లంగర్​హౌస్​ పరిధిలో జరిగింది. ఛాందీ మహ్మద్​, ఫయాదుద్దీన్​పై దుండగులు కత్తులతో దాడి చేశారు.

two persons murdered at langar house  hyderabad on friday
కత్తులతో దాడి చేసి చంపేశారు
author img

By

Published : Jun 6, 2020, 6:54 AM IST

హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఛాందీ మహ్మద్‌, ఫయాదుద్దీన్‌ అనే ఇద్దరు వ్యక్తులపై... దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా... మరొకరు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఛాందీ మహ్మద్‌, ఫయాదుద్దీన్‌లో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... ముగ్గురు వ్యక్తులు వారిని వెనకనుంచి క్వాలిస్‌తో ఢీకొట్టారు. కిందపడ్డాక... కారులోంచి వచ్చి కత్తులతో దాడి చేసి... కారును అక్కడే వదిలి వెళ్లిపోయారు.

కత్తులతో దాడి చేసి చంపేశారు

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...నిందితుల్లో ఒకరు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ అని తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం... నిందితులను తొందర్లోనే పట్టుకుంటామని వెల్లడించారు.

ఇవీ చూడండి: నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.