ETV Bharat / state

జీఎస్టీ ఎగవేత కేసు - కావ్య మైనింగ్ ఎండీ, బిగ్‌ లీప్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్ అరెస్ట్ - హైదరాబాద్​ జీఎస్టీ ఫ్రాడ్

Two People Arrested GST Fraud Case in Hyderabad : హైదరాబాద్​లో పన్నులు ఎగవేసినట్లు గుర్తించిన సంస్థలపై వాణిజ్య పన్నుల శాఖ కొరఢా ఝుళిపించింది. జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన రెండు సంస్థలపై చర్యలు తీసుకుంది. బిగ్‌లీప్‌ టెక్నాలజీస్‌, కావ్య మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ నిర్వాహకులను అరెస్ట్ చేసింది.

GST Fraud in hyd
GST Fraud in hyd
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 11:41 AM IST

Updated : Dec 31, 2023, 12:35 PM IST

Two People Arrested GST Fraud Case in Hyderabad : హైదరాబాద్‌ కేంద్రంగా రెండు రోజులుగా వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. ఇప్పటికే పన్నులు ఎగవేసిన సంస్థలను గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే జీఎస్టీ ఎగవేత కేసులో కావ్య మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రాజ్‌కుమార్​ రెఖ్యా రూప్​సింగ్ నాయక్​ను అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించినట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి తెలిపారు.

Kavya Mining Infrastructures Private Limited MD Arrested : 2021లో సరూర్​నగర్ సర్కిల్ పరిధి చంపాపేట్​లో ఈ మైనింగ్ సంస్థను రూప్​సింగ్ నాయక్​ ఏర్పాటు చేసి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి (Commercial Taxes Department) తెలిపారు. వ్యాపార లావాదేవీలు చేయకుండానే, బోగస్ ఇన్వాయిస్​లు సృష్టించి మహారాష్ట్ర నాగపూర్ ప్రాంతంలోని పలు సంస్థలకు ఇచ్చారని పేర్కొన్నారు. దాదాపు రూ.వంద కోట్ల టర్నోవర్​కు సంబంధించిన ఇన్వాయిస్​లు ఇచ్చినట్లు శ్రీదేవి వెల్లడించారు.

ఆ సంస్థల్లో ఆడిటింగ్‌ మర్చిపోయిన వాణిజ్య పన్నుల శాఖ

రూ.18.55 కోట్ల జీఎస్టీ ఎగవేత : ఇందుకు సంబంధించి మొత్తం రూ.18.55 కోట్ల జీఎస్టీ ఎగవేతకు (GST Fraud) పాల్పడినట్లు గుర్తించామని టీకే శ్రీదేవి వివరించారు. వ్యాపార లావాదేవీలు చేయకుండానే మైనింగ్ కంపెనీ తరఫున తప్పుడు ఇన్వాయిస్​లు జారీ చేసిందని పేర్కొన్నారు. ఆ ఇన్వాయిస్​లు, ఐటీసీ క్రెడిట్​ను ఇతర కంపెనీలకు బదిలీ చేసినట్లు గుర్తించామని అన్నారు. రూప్​సింగ్ నాయక్​ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించారని చెప్పారు. అనంతరం అతడిని అధికారులు చంచల్​గూడ జైలుకు తరలించారని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు శ్రీదేవి వివరించారు.

KTR Comments on GST: 'జీఎస్టీ పెంచి వస్త్ర పరిశ్రమను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర'

రూ.27 కోట్ల జీఎస్టీ ఎగవేత : మరో ఘటనలో బేగంపేట కేంద్రంగా కొనసాగుతున్న బిగ్‌ లీప్‌ టెక్నాలజీస్‌ సొల్యూషన్స్‌ సంస్థ డైరెక్టర్ వినయ్‌ కొట్రాను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అరెస్టు చేశారు. మ్యాన్‌ పవర్‌ సప్లై చేస్తున్న ఈ సంస్థ, గత ఐదు సంవత్సరాలుగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి తెలిపారు. 2018-19 నుంచి ఇప్పటి వరకు రూ.27.07 కోట్లు ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆమె పేర్కొన్నారు.

ఐటీసీ బదిలీపై ఆరా తీస్తున్న అధికారులు : ఈ కంపెనీ జీఎస్టీ చెల్లించకపోగా, ఐటీసీని ఇతర సంస్థలకు కూడా బదిలీ చేసినట్లు టీకే శ్రీదేవి వివరించారు. ఐదు కోట్లకు మించి జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లయితే, అరెస్టు చేసే అధికారం ఉండడంతో బిగ్‌లీప్‌ కంపెనీ డైరెక్టర్‌ వినయ్‌ కొట్రాను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చేందుకు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. బిగ్‌లీప్‌ కంపెనీ నుంచి ఏయే సంస్థలకు ఐటీసీ బదిలీ అయిందో ఆరా తీస్తున్నామని టీకే శ్రీదేవి వెల్లడించారు.

Fake GST Registrations : నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం

15 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. డిసెంబర్​లో ఎంతంటే?

Last Updated : Dec 31, 2023, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.