పాఠశాల విద్యా బోధనలో సాంకేతిక సమాచారంతో డిజిటలైజేషన్లో విశిష్ఠ ప్రతిభ చూపుతున్న ఉపాధ్యాయులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జాతీయ పురస్కారాలతో సత్కరించింది. ఉపాధ్యాయుల జాతీయ ఐసీటీ అవార్డులు- 2017కి గానూ తెలంగాణ నుంచి ఇద్దరు టీచర్లు ఎంపికయ్యారు. దిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే చేతుల మీదుగా హైదరాబాద్‌కు చెందిన ఉమారాణి, గజ్వేల్‌కు చెందిన దేవనపల్లి నాగరాజు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. దేశంలో మొత్తం 43 మంది అవార్డులకు ఎంపిక కాగా.. అందులో తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు ఉన్నారు.
ఉమారాణి హైదరాబాద్‌లోని లాలాగూడలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ వినియోగంతో డిజిటల్ బోధనాభ్యాసం చేస్తున్నారు. గజ్వేల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తోన్న నాగరాజు... సాంకేతిక సహకారంతో విద్యాబోధన చేస్తూ... ఇతర ఉపాధ్యాయులకు కూడా డిజిటల్ బోధనపై అవగాహన కల్పిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు బోధన చేస్తేనే నేటితరంతో పోటీపడగలరని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: హేమంత్ సోరెన్‌కు కేసీఆర్,కేటీఆర్ శుభాకాంక్షలు