గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2లక్షల 9వేల 374మందికి టీకాలు వేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఒకే రోజు ఇంత భారీ మొత్తంలో టీకాలు అందించటం ఇదే తొలిసారి. తాజాగా ఇచ్చిన టీకాల్లో లక్షా 96 వేల 887 మందికి తొలిడోసు కాగా... మరో 12,487 మందికి రెండో డోస్ టీకా ఇచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 61 లక్షల 13 వేల 416మందికి తొలిడోసు, 14 లక్షల 95 వేల 199మందికి రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 76లక్షల 8వేల 615మందికి టీకాలు అందించగా అందులో 69లక్షల 40వేల 645 ప్రభుత్వ ఆస్పత్రుల ఆధ్వర్యంలో కాగా మరో 6లక్షల 67వేల 970 టీకాలు ప్రైవేటు ఆస్పత్రుల వారు అందించారు. ఇక ఇప్పటివరకు తెలంగాణకు కొవిన్ పోర్టల్ ప్రకారం 70లక్షల 15వేల 150టీకా డోసులు కేటాయించగా అందులో ఇప్పటికే 69 లక్షల 40 వేల 645 టీకా డోసులు వినియోగించినట్టు వైద్య ఆరోగ్య శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: black fungus: జోరుగా బ్లాక్ ఫంగస్ ఔషధాల అక్రమ విక్రయాలు