ETV Bharat / state

HOUSE DESTROYED LIVE VIDEO: వరద ఉద్ధృతికి కూలిన భవనం.. లైవ్ వీడియో

HOUSE DESTROYED IN RAILWAY KODURU: గుంజన ఏరు ఉద్ధృతికి కళ్ల ముందే రెండంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన ఏపీలోని కడప జిల్లా రైల్వేకోడూరు నరసరాంపేటలో జరిగింది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏరులో వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో భూమి కోతకు గురై భవనం కూలింది.

HOUSE DESTROYED WITH RAINS
HOUSE DESTROYED WITH RAINS
author img

By

Published : Nov 28, 2021, 7:54 PM IST

HOUSE DESTROYED IN RAILWAY KODURU: ఏపీలోని కడప జిల్లా రైల్వేకోడూరులోని నరసరాంపేటలో భారీ వర్షాలకు రెండంతస్తుల భవనం కుప్పకూలింది. పది రోజులుగా కురుస్తున్న వానలకు గుంజన ఏరు ఉద్ధృతంగా(Water flow of Gunjana stream) ప్రవహిస్తోంది. దీంతో భూమి భారీగా కోతకు గురై రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

వరద ఉద్ధృతికి కూలిన భవనం.. లైవ్ వీడియో

వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఇంకా ఎన్ని నివాసాలు కూలుతాయోనని ఆందోళన చెందుతున్నారు. 30 సంవత్సరాలుగా గుంజన ఏరు చుట్టుపక్కలా రక్షణ గోడ నిర్మించాలని కోరినా అధికారులు స్పందించలేదని కన్నీటి పర్యంతమయ్యారు.

చూస్తుండగానే ఇల్లు కుప్పకూలిపోవడంతో ఆవేదనకు లోనైన నరసరాంపేట వాసులు.. ఆందోళన(Protest in narasaraopet) చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇల్లు కోల్పోయిన వారికి.. ప్రభుత్వం స్పందించి వెంటనే ఇల్లు నిర్మించాలంటూ బాధితులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: Houses Shrinking: ఆ నగరానికేమైంది.. మొన్నటిదాకా వరదలు.. ఇప్పుడేమో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.