ETV Bharat / state

శ్రీశైలంలో కాజేసింది రూ.2.5 కోట్లు

ఏపీలోని శ్రీశైలంలో కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసి పొరుగు సేవల సిబ్బంది కాజేసిన మొత్తం రూ.2.5 కోట్లకుపైగా ఉన్నట్లు తెలిసింది. ఆలయానికి సాఫ్ట్​వేర్ అందించే సంస్థలో పని చేసే పొరుగు సిబ్బందే ఇదంతా నడిపినట్లు గుర్తించారు.

శ్రీశైలంలో కాజేసింది రూ.2.5 కోట్లు
శ్రీశైలంలో కాజేసింది రూ.2.5 కోట్లు
author img

By

Published : Jun 2, 2020, 10:56 AM IST

ఆంధ్రప్రదేశ్​లో పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలో కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసి పొరుగు సేవల సిబ్బంది కాజేసిన మొత్తం రూ.2.5 కోట్లకుపైగా ఉన్నట్లు తెలిసింది. రూ.150 దర్శన టికెట్లు, అభిషేకం టికెట్లలో అక్రమాలు చేయడం ద్వారా రూ.1.42 కోట్లు కాజేసినట్లు తొలుత గుర్తించిన ఆలయ ఈవో కేఎస్‌ రామారావు.. ఈ వివరాలను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు అదనపు కమిషనర్‌ను విచారణ అధికారిగా నియమించారు. దర్శన టికెట్లు, దాతల విరాళాలను సాఫ్ట్‌వేర్‌లో లొసుగుల ఆధారంగా కాజేసినట్లు గుర్తించారని తెలిసింది. పెట్రోలు బంకులోనూ రూ.42 లక్షలు వెనకేసినట్లు గుర్తించారని సమాచారం. ఆలయానికి సాఫ్ట్‌వేర్‌ అందించే సంస్థలో పనిచేసే పొరుగు సిబ్బంది ఇదంతా నడిపినట్లు గుర్తించారు. 2016-19 మధ్య ఇది జరిగిందని, ఇద్దరు ఆలయ సిబ్బంది, 20 మంది పొరుగుసేవల సిబ్బంది ఓ బృందంగా ఏర్పడి ఇదంతా చేశారని తేల్చారు. సాఫ్ట్‌వేర్‌పై ఆలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడం, పొరుగుసేవల సిబ్బందిని అధికారులు పర్యవేక్షించకపోవడం కూడా లోపంగా గుర్తించారు.

సింహాచలంలోనూ నిర్లక్ష్యం

ఏపీ విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలోనూ వివిధ ఆరోపణలపై ఇటీవల సంయుక్త కమిషనర్‌ చంద్రశేఖర్‌ విచారణ జరిపి, ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ఆలయ ఘాట్‌ రోడ్‌ విస్తరిస్తుండగా, దానికోసం తవ్విన గ్రావెల్‌ను బయటకు తరలించారు. దీని విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని గుర్తించారు. పంచగ్రామాల పరిధిలో సింహాచల ఆలయ భూముల్లో కొత్తగా 23 ఇళ్ల నిర్మాణం జరిగినా అధికారులు అడ్డుకోలేకపోయారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

ఇవీ చూడండి: పోరాటాల తెలంగాణలో సంస్కరణల పాలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.