ETV Bharat / state

సిర్లాహిల్స్​కాలనీలో భార్యాభర్తకు కరోనా పాజిటివ్​ - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్​ మీర్​పేట్​ పరిధిలోని సిర్లాహిల్స్ కాలనీలో ఇద్దరికి కరోనా పాజిటివ్​ వచ్చింది. అప్రమత్తమైన జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​, ఆర్డీవో రవీందర్​ రెడ్డి, వైద్య, పోలీసు అధికారులు కాలనీలో పర్యటించి శానిటైజేషన్​ చర్యలు చేపట్టారు.

Corona at Meerpet
సిర్లాహీల్స్​కాలనీలో భార్యభర్తకు కరోనా పాజిటివ్​
author img

By

Published : May 13, 2020, 1:25 PM IST

హైదరాబాద్​ మీర్​పేట పరిధి సిర్లాహిల్స్​ కాలనీకి చెందిన ఓ జంటకు కరోనా పాజిటివ్​ రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్​ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మహిళతో పాటు ఆమె భర్తకు పాజిటివ్​ వచ్చింది. అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ కలెక్టర్​ అమోయ్​ కుమార్​, ఆర్డీవో రవీందర్​ రెడ్డి, ఎల్బీనగర్​ డీసీపీ, వైద్య అధికారులు కాలనీలో పర్యటించి పరిసరాలను రసాయనాలతో శానిటైజేషన్​ చేయించారు.

కరోనా వచ్చిన వారితో ప్రత్యక్ష సంబంధమున్న13 కుటుంబాలను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి... సిర్లాహిల్స్ కాలనీని 15 రోజుల వరకు కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. కాలనీలో ప్రజలకు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తూ... నిరంతరం శానిటైజేషన్ చేయాలని స్థానిక అధికారులకు సూచించారు. సుమారు వంద కుటుంబాలను హోం క్వారంటైన్​లో ఉంచామని కలెక్టర్ తెలిపారు.

ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ సమరం.. గాంధీభవన్‌లో దీక్ష ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.