ETV Bharat / state

నందకుమార్‌పై పీటీ వారెంట్‌... కోర్టు అనుమతిస్తే ఇక అరెస్టే! - నందకుమార్‌పై హైదరాబాద్‌లో మరో రెండు కేసులు

Cheating cases against Nanda Kumar: ఎమ్మెల్యే ఎర కేసులో నిందితుడైన నందకుమార్‌పై నమోదైన కేసుల దృష్ట్యా పోలీసులు పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. ఓ స్థలం విషయంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు.... నాంపల్లి కోర్టులో పీటీ వారంట్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతిస్తే నందకుమార్‌ను పోలీసులు అరెస్టు చేయనున్నారు.

Cheating cases against Nanda Kumar
Cheating cases against Nanda Kumar
author img

By

Published : Nov 14, 2022, 2:07 PM IST

Updated : Nov 14, 2022, 3:01 PM IST

Cheating cases against Nanda Kumar: రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన... తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల్లో ఒకరైన నందకుమార్‌పై బంజారాహిల్స్ ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. డెక్కన్ కిచెన్ యాజమాన్యంతో పాటు నంద వద్ద వద్ద స్థలం లీజుకు తీసున్న మరో వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. 2021 జూన్ లో తమ ప్రాంగణాన్ని నందకుమార్ వ్యాపారానికి వాడుకోమ్మన్నాడని... తన సోదరులతో కలిసి 3వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు అయాజ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

స్థలం ఇచ్చినందుకు 12లక్షల అడ్వాన్స్, నెలకు 2లక్షల అద్దె, లాభాల్లో 10శాతం వాటా ఇస్తున్నట్లు చెప్పారు. కాగా... నందకుమార్ తమకు లీజుకు ఇచ్చిన స్థలం దగ్గుబాటి సురేష్, వెంకటేశ్ నుంచి ఆయన లీజుకు తీసుకున్నాడని తెలిసిందని అయాజ్ ఫిర్యాదులో వివరించాడు. అక్రమంగా లీజుకు ఇచ్చినట్లు గుర్తించి.... తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడినట్లు వివరించారు.

డెక్కన్ కిచెన్ సమీపంలో 700 చదరపు అడుగుల స్థలాన్ని లీజు వ్యవహారంలోనూ మరో వ్యక్తి మరో ఫిర్యాదుతో నందకుమార్‌పై రెండో కేసు నమోదైంది. హైదరాబాద్‌లో గ్యాడ్జెట్ స్టూడియో పేరుతో చరవాణి పరికరాల వ్యాపారం చేస్తున్న సందీప్.... నెలకు లక్షన్నర అద్దె, 12లక్షల అడ్వాన్స్‌తో నందకుమార్ వద్ద స్థలం లీజుకు తీసుకున్నారు. 50లక్షలతో వ్యాపారం కోసం స్థలాన్ని అభివృద్ధి చేసుకోగా.... తీరా అది దగ్గుబాటి కుటుంబసభ్యులకు చెందిన స్థలంగా తెలిసిందని బాధితుడు వాపోయాడు. ఇద్దరి ఫిర్యాదుల మేరకు పలుసెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేష్‌లో నమోదైన ఈ 2కేసుల దృష్ట్యా.... నాంపల్లి కోర్టులో పోలీసులు పీటీ వారంట్‌ దాఖలు చేశారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా నందకుమార్ అరెస్టుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి కోరుతూ పీటీ వారంట్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఎర కేసులో ఏ-2గా ఉన్న నందకుమార్‌.... చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నాంపల్లి కోర్టు అనుమతిస్తే పోలీసులు నందకుమార్‌ను అరెస్టు చేయనున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Nov 14, 2022, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.