రెస్టారెంట్ పేరుతో నిషేధిత హుక్కా సెంటర్ నడుపుతోన్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.12 లో అర్బన్ గ్రిల్ పేరుతో సుజాత్, రంజిత్ అనే వ్యక్తులు యువతీ యువకులే లక్ష్యంగా హుక్కా సెంటర్ను నడుపుతున్నారు.
దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. వారి నుంచి హుక్కా సామాగ్రి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: వ్రతం చెడ్డా దక్కని ఫలం..!