హైదరాబాద్ చైతన్యపురిలో స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వ్యాపార భాగస్వాముల వేధింపులే కారణమని సెల్ఫీ వీడియోలో మృతుడు చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని... ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. వ్యాపారంలో మోసం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపించగా... భాగస్వాములను పోలీసులు విచారిస్తున్నారు.
చైతన్యపురిలోని షణ్ముఖ డెవలపర్స్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్ యాదగిరి ఉరేసుకుని బలవన్మరనానికి పాల్పడ్డాడు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ... కంపెనీ అభివృద్ధి కోసమే అహర్నిశలు శ్రమించానని తాను తీసుకున్న సెల్ఫీ వీడియోలో మృతుడు కన్నీటి పర్యంతమయ్యాడు.