Twin Reservoirs : హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వానకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. రహదారులపైకి వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. పనులపై బయటకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు.
ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరంలోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్‌సాగర్‌కు వరద ప్రవాహం పోటెత్తింది. ఉస్మాన్‌సాగర్ జలాశయానికి ప్రస్తుతం 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2,442 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,787.20 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
హిమాయత్‌సాగర్ జలాశయంలోకి 1,200 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 4 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 1320 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,760.90 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
మరోవైపు హుస్సేన్సాగర్లోకీ భారీగా వరద నీరు చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయి దాటింది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లుగా ఉంది.
ఇవీ చూడండి.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం!
పోలీస్‌స్టేషన్‌లో అక్కాచెల్లెళ్ల వీరంగం.. మహిళా ఇన్స్పెక్టర్ను చెప్పుతో కొట్టి..