హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు తెలంగాణ విద్యార్థి వేదిక ధర్నా చేపట్టింది. అక్రమంగా అరెస్టు చేసిన ప్రొఫెసర్ సాయిబాబా, విరసం వ్యవస్థాకుడు వరవరరావు, ఇతర ప్రజాస్వామికవాదులను విడుదల చేయాలని టీవీవీ సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి, 90 శాతం అంగవైకల్యంతో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయని అరెస్టు చేసి జైల్లో పెట్టడం అన్యాయమన్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి గాంధీ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
'సాయిబాబా, వరవరరావును విడుదల చేయాల్సిందే'
అక్రమంగా అరెస్టు చేసిన ప్రొఫెసర్ జీఎం సాయిబాబా, విరసం వ్యవస్థాకుడు వరవరరావుని విడుదల చేయాలంటూ టీవీవీ డిమాండ్ చేసింది. ట్యాంక్ బండ్పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగింది.