టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను పోలీసులు సుధీర్ఘంగా విచారించారు. మూడో రోజు ఉదయం పదిన్నర గంటలకు హాజరైన ఆయన్ను పోలీసులు పలు అంశాలపై ప్రశ్నించారు. రవి ప్రకాష్ సరైన విధంగా సమాధానాలు చెప్పడంలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు టీవీ9 లోగోల విక్రయం కేసులో బంజారాహిల్స్ పోలీసులు రవి ప్రకాష్‌కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. రేపు బంజారాహిల్స్ ఠాణాలో హాజరుకావాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: రవి ప్రకాశ్‌కు మరోసారి నోటీసులు