ETV Bharat / state

Tummala Join Congress : మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల - Tummala Nageswara Rao latest news

Telangana Assembly Elections 2023
telangana congress
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 3:04 PM IST

Updated : Sep 16, 2023, 10:17 PM IST

15:01 September 16

హోటల్‌ తాజ్‌కృష్ణలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల

Tummala Join Congress మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల

Tummala Join Congress : నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ పయనం ఇకపై కాంగ్రెస్​లో సాగనుంది. హైదరాబాద్​లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో శనివారం తుమ్మల హస్తం గూటికి చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పిన ఖర్గే.. పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్​తో 9 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి తెగదెంపులు చేసుకున్న సీనియర్ నేత జిల్లాలో కాంగ్రెస్ కీలకనేతగా మారనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)చేరిక ఉభయ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది.

CWC Meeting Started at Hyderabad : హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశాలు

Joint Khammam District Politics Latest News 2023 : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్​( ప్రస్తుత బీఆర్ఎస్​) ప్రజలు బ్రహ్మరథం పట్టినప్పటికి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని (Joint Khammam District ) ఒక్కస్థానమే దక్కింది. 2014 ఎన్నికల్లో ఒక్క కొత్తగూడెం స్థానాన్ని గులాబీ పార్టీ దక్కించుకుంది. అదే ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పటికే జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవంతోపాటు రాజకీయంగా ఆత్మీయుడైన తుమ్మలను కేసీఆర్ గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు.

Tummala Nageswara Rao Joins Congress : కేసీఆర్ ఆహ్వానం మేరకు 2014 సెప్టెంబరులో తుమ్మల నాగేశ్వరరావు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అప్పటి వరకు కనీస ఉనికిలేని అప్పటి టీఆర్ఎస్​ ‍(ప్రస్తుత బీఆర్ఎస్​).. ఆయన చేరికతో బలీయశక్తిగా ఎదిగింది. భారీగా నేతలు, కార్యకర్తలు తుమ్మల వెంట గులాబీ దండులో చేరడం పార్టీకి జవసత్వాలు నింపింది. అదే ఏడాది చివర్లో తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రిగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. 2015లో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత 2016లో పాలేరుకు ఉపఎన్నిక రాగా.. అక్కడి నుంచి తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు.

ఇలా ప్రభుత్వంలో పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. రాజకీయ పునరేకీకరణలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలంతా గులాబీ బాటపట్టడంతో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల ఓటమి పాలయ్యారు. పాలేరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గులాబీ గూటికి చేరడంతో.. రాజకీయంగా ఆయన మౌనంగా ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు సీఎం పిలుపుమేరకు తుమ్మల నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు.

సీఎం కేసీఆర్​పై నమ్మకంతో పాలేరు టికెట్ వస్తుందని తుమ్మల నాగేశ్వరరావు నమ్మారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాలకే మళ్లీ అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో.. తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత జిల్లాలో ఆయన బలప్రదర్శన చేయడం, కార్యకర్తలు, అనుచరుల ఒత్తిడి మేరకు వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించడం, ఈ మేరకు కాంగ్రెస్ నేతలు.. తుమ్మల నాగేశ్వరరావుతో సంప్రదింపులు జరగడం వంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Tummala Nageswara Rao : ఇందులో భాగంగా బీఆర్ఎస్​కు శనివారం రాజీనామా ప్రకటించిన తుమ్మల నాగేశ్వరరావు.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరడంతో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్​తో దాదాపు 9 ఏళ్ల రాజకీయ బంధానికి ఆయన తెగదెంపులు చేసుకున్నట్లైంది. శనివారం తుమ్మల ఒక్కరే హస్తం గూటికి చేరగా.. త్వరలోనే ఉభయ జిల్లాల నుంచి భారీగా ఆయన అనుచరులు, కార్యకర్తలు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పలువురు ముఖ్యనేతలు సైతం హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Congress Vijayabheri Sabha in Tukkuguda : 'విజయ భేరి' విజయానికి కాంగ్రెస్ పక్కాప్లాన్.. సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్

ఖమ్మం, పాలేరులో ఒకచోట తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి.. చేరికలు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్​లో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభకు అన్ని నియోజకవర్గాల నుంచి తరలివెళ్లేందుకు తుమ్మల వర్గీయులు సిద్ధమయ్యారు. ఆయన హస్తం పార్టీలో చేరడంతో పాలేరు, ఖమ్మం నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటూ రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగుతుంది. పార్టీలో తుమ్మల చేరికతో ఉభయ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది.

ఇప్పటికే జిల్లాలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్​లో.. తుమ్మల నాగేశ్వరరావు చేరిక మరింత జోష్ నింపుతోంది. ఇటీవలే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి హస్తం పార్టీలో చేరి జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తుండగా.. తాజాగా తుమ్మల చేరికతో రాబోయే ఎన్నికలకు జిల్లా కాంగ్రెస్​కు కొండంత బలం నింపుతోంది. తుమ్మల కాంగ్రెస్ లోకి రావడాన్ని స్వాగతిస్తూ శనివారం పలు నియోజకవర్గాల్లో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. తుమ్మల తమ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తూ పలు ప్రాంతాల్లో హస్తం శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి. దాదాపు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు ప్రత్యర్థిగానే రాజకీయాలు చేస్తూ వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు.. తాజాగా అదే పార్టీలో చేరడం గమనార్హం.

Thummala Comments on Assembly Elections 2023 : నా ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: తుమ్మల

Congress Leaders Meeting Tummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి

Last Updated : Sep 16, 2023, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.