ETV Bharat / state

ఏడో పర్వతారోహణకు తుకారాం సన్నద్ధం - ఏడో పర్వతారోహణకు వెళ్లనున్న తుకారాం

తెలంగాణ యువకుడు ఆమ్గోత్ తుకారాం ఏడో పర్వతారోహణకు సన్నద్ధమవుతున్నాడు. దక్షిణ అమెరికాలోని మౌంట్ అకాన్గోగాను అధిరోహించేందుకు జనవరి 5 తన యాత్రను ప్రారంభించనున్నట్టు ప్రకటించాడు.

Tukaram is a mountaineer preparing for the seventh mountaineer
ఏడో పర్వతారోహణకు సన్నద్ధమవుతున్న తుకారాం
author img

By

Published : Dec 29, 2019, 6:28 PM IST

పర్వతారోహకుడు ఆమ్గోత్​ తుకారాం ఏడోసారి పర్వతారోహణకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఇప్పటి వరకు భారత్​లోని నోర్బూ, రుదుగారియా, స్టాకాంగ్రీ పర్వతాలతో పాటు... ఆఫ్రికాలోని కిలిమాంజారో, ఎవరెస్ట్, యూరోప్ ఖండంలోని ఎల్​బ్రూస్ పర్వతాలను అధిరోహించిన తుకారం ఇప్పుడు దక్షిణ అమెరికాలోని మౌంట్​ అకాన్గోగాను అధిరోహించేందుకు పూనుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్రిదండి అహోబిల రామానుజ జీయర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమ్గోద్ తుకారాంకు చిన్న జీయర్ స్వామి తరఫున ఆర్థిక సాయం అందించారు. దేశానికి వన్నె తెచ్చే పనులను యువత ఉత్సాహంగా చేస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించాలని చిన్నజీయర్​​ పేర్కొన్నారు. తనను గేలి చేనివారికి... తన గెలుపే సమాధానంగా నిలిచిందని తుకారాం పేర్కొన్నారు.

ఏడో పర్వతారోహణకు సన్నద్ధమవుతున్న తుకారాం

ఇవీ చూడండి: రాష్ట్రంలో జనాభా కంటే.. ఆధార్‌ కార్డులే ఎక్కువట.?

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.