ETV Bharat / state

TTD RAIN ALERT: తిరుమలలో వర్షం.. ఘాట్​రోడ్లలో ద్విచక్రవాహనాలు నిలిపివేత - ap news

తిరుమలలో మళ్లీ వర్షం(rain in tirumala) కురుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన వర్ష బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రత దృష్ట్యా..ఘాట్​రోడ్లలో ఆంక్షలు విధించారు.

TTD ALERT WITH RAINS
TTD ALERT WITH RAINS
author img

By

Published : Nov 28, 2021, 5:24 PM IST

TTD ALERT WITH RAINS : తిరుమలలో కురుస్తున్న వర్షాలతో (rain in tirumala) తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. వారం రోజుల క్రితం కురిసిన వర్షాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా... ఘాట్​రోడ్లలో ఆంక్షలు(Restriction on tirumala ghat roads) విధించారు. రెండు ఘాట్​రోడ్లలో ద్విచక్రవాహనాలను నిలిపివేసిన తితిదే అధికారులు...భక్తులను అప్రమత్తం చేస్తున్నారు.

ఏపీలోని తిరుపతిలో వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. నగరంలోని పలు కాలనీలు.. ఇంకా వరద ముంపులోనే(Floods continue in Tirupati) ఉన్నాయి. నగర సమీపంలోని పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువు నుంచి వరద నీరు రావడంతో.. సరస్వతినగర్‌, గాయత్రీనగర్‌, శ్రీకృష్ణనగర్‌, ఉల్లిపట్టెడలో వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది.

కాలనీల్లో పేరుకుపోయిన మట్టి

పట్టణంలో లోతట్టు ప్రాంతాలైన ఆటోనగర్‌, సంజయ్‌గాంధీ కాలనీల్లో వరద మట్టి పెద్దఎత్తున పేరుకుపోయింది. దుర్గానగర్‌, యశోదనగర్‌, మధురానగర్‌ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు(Tirupati still in the grip of flood waters) పడుతున్నారు. తిరుపతిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

ఇదీ చూడండి: Lorry fire in kataram: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ... పూర్తిగా దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.