అయోధ్య రామాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానల్లో ప్రత్యక్షప్రసారం చేయకపోవడాన్ని విమర్శిస్తూ భాజపా ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేసిన ప్రకటనపై తితిదే స్పందించింది. రామ మందిర భూమి పూజ జరిగిన సమయంలో(12:44 గంటలకు) శ్రీవారి కల్యాణోత్సవం ప్రత్యక్షప్రసారం చేయాల్సి ఉన్నందున శంకుస్థాపన కార్యక్రమం ప్రసారం చేయలేకపోయామని ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 వరకు నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తామని.. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది భక్తులు వీక్షిస్తుంటారని పేర్కొంది.
రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం మొత్తం రికార్డ్ చేసి యానిమేషన్‌తో గురువారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసిందని తితిదే తెలిపింది. హిందూ ధర్మ పరిరక్షణకు దేవస్థానం కట్టుబడి ఉందని.. పాలకమండలి ఈ దిశగా అనేక చర్యలు చేపట్టినట్లు ప్రకటనలో వివరించింది.
ఇదీ చూడండి: ఇరుకు గల్లీల్లో జనం రద్దీవల్ల విరుచుకుపడుతున్న కరోనా!