కల్యాణమస్తు కార్యక్రమంలో పెళ్లి చేసుకునే నిరుపేద జంటలకు రెండు గ్రాముల బంగారు మంగళసూత్రాలను తితిదే ఇవ్వనుంది. ఈ మేరకు ఆలయ ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేసింది. ముందుగా గ్రాము మంగళసూత్రాన్ని ఇవ్వాలని అనుకున్నా తయారీకి ఇబ్బందులు ఎదురవుతుండటంతో తితిదే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేయాలనుకున్న నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని కల్యాణమస్తు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. రానున్న రోజుల్లో తితిదే నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమంలో జంటలకు వీటిని అందించనున్నారు.
ఏప్రిల్ కోటా విడుదల
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను శనివారం ఉదయం 9గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన అద్దె గదుల కోటాను శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.
ఇదీ చదవండి: 'కరోనాతో కొత్తగా పేదరికంలోకి వెళ్లిన 13.1 కోట్ల మంది'