TTD EO DHARMA REDDY SON HEART ATTACK: తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 28 ఏళ్ల చంద్రమౌళికి పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది.
రెండు కుటుంబాలవారు శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వానపత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. కాసేపటికే గుండెనొప్పిగా ఉన్నట్లు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. వెంటనే శేఖర్‌రెడ్డి తదితరులు అక్కడకు చేరుకున్నారు.
ఇవీ చదవండి: సికింద్రాబాద్‌లో రుద్రమ శక్తి.. వరంగల్‌లో భద్రకాళి శక్తి
కొత్త ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్.. మోదీతో భేటీ కావాల్సి ఉండగా..