ETV Bharat / state

తలనీలాలపై తప్పుడు ప్రచారం చేశారంటూ తితిదే ఫిర్యాదు - ap news

శ్రీవారి భక్తులకు సమర్పించిన తలనీలాలకు సంబంధించి అసత్య కథనాల ప్రచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది తితిదే. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతోనే ప్రచారం చేశారని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

తితిదే, తలనీలాల గొడవ
ttd, hair, ap news,
author img

By

Published : Mar 31, 2021, 8:21 AM IST

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలను చైనాకు తితిదే స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిందని సామాజిక మాధ్యమాల్లో తప్పడు ప్రచారం చేశారంటూ కొంత మంది వ్యక్తులపై పోలీసులకు తితిదే ఫిర్యాదు చేసింది. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్​లో విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇచ్చారు.

తితిదే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రామ రాజ్యం మళ్లీ మొదలైంది ఫేస్​బుక్​ పేజీ, తెలుగుదేశం పార్టీ రాజకీయ విభాగంతో పాటు గంగా ప్రకాష్, ప్రియాంక రెడ్డి స్వచ్ఛపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: మయన్మార్​లో పట్టుబడిన తలనీలాలతో మాకు సంబంధం లేదు: తితిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.