తిరుమలలో పవిత్ర ఉద్యానవనం పెంచేందుకు తితిదే శ్రీకారం చుట్టింది. శిలాతోరణం వద్ద 35 ఎకరాల్లో ఉద్యానవన ఏర్పాటుకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డితో కలసి మొక్కలు నాటారు. శిలాఫలకం ఆవిష్కరించారు. శ్రీవారి సేవలకు వినియోగించే పూలు, పళ్లను ఇక్కడే పెంచేందుకు ఉద్యానవనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వనంలో 25 రకాల మొక్కలు ఉన్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు గోగర్భం వద్ద 1.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న శ్రీవేంకటేశ్వర శ్రీగంధపు ఉద్యానవనాన్ని ప్రారంభించారు.
ఇవీ చూడండి... ప్రగతిభవన్లో థాయ్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ